HYD : కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసిన వ్యక్తికి షాక్!

by Sathputhe Rajesh |

కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చిక్కుల్లో పడ్డాడు.

HYD : కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసిన వ్యక్తికి షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన నగరంలోని చందానగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ చందానగర్ లో నివాసం ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగి డిసెంబర్‌లో ఆన్ లైన్ లో కాల్ గర్ల్ కోసం సెర్చ్ చేశాడు. ఓ వెబ్ సైట్ లో వాట్సాప్ నంబర్ దొరకడంతో అవతలి వ్యక్తి చార్మి పటేల్ పేరుతో పరిచయం చేసుకుని అమ్మాయిల చిత్రాలను పంపించాడు. బుకింగ్ కోసం రూ.500 పంపాలని కోరాడు. సెక్యూరిటీ డిపాజిట్ అంటూ రూ. 5వేల, రూ.7వేల 800 పంపాలని సూచించాడు. నిజమే అనుకున్న సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇలా మొత్తం రూ. 1.97లక్షలు పంపాడు. తరువాత ఎంతకు రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మోసాపోయానని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు.

Next Story