- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: మణికొండలో భారీ అగ్నిప్రమాదం
by Gantepaka Srikanth |
హైదరాబాద్(Hyderabad) మణికొండ(Manikonda)లో భారీ అగ్నిప్రమాదం(Fire, Manikonda) సంభవించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మణికొండ(Manikonda)లో భారీ అగ్నిప్రమాదం(Fire, Manikonda) సంభవించింది. 19 అంతస్తుల BRC అపార్ట్‌మెంట్‌లో ఆదివారం మధ్యా్హ్నం మంటలు చెలరేగాయి. విద్యుత్ వైర్ల డక్ యూనిట్‌లో ఈ మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అపార్ట్‌మెంట్ వాసులంతా భయంతో ఇళ్ల నుంచి పరుగులు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సాయంతో పోలీసుల మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. భయంతో పరుగులు తీసే క్రమంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






