- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: జేఎన్టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య
హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య(JNTU B.Tech Student Divya Suicide)కు పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య(JNTU B.Tech Student Divya Suicide)కు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. అయితే.. దివ్య మరణంపై అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు.. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో ధర్నాకు దిగాయి. ఇవాళ 28న జేఎన్టీయూ వర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో యూనివర్శిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థిని మృతికి కారణమైన జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






