లిప్ స్టిక్ పూసుకుని ఆడవారి‌ లో దుస్తులు ధరిస్తున్న భర్త.. వైఫ్ షాకింగ్ డిసిషన్!

by Rajesh |
లిప్ స్టిక్ పూసుకుని ఆడవారి‌ లో దుస్తులు ధరిస్తున్న భర్త.. వైఫ్ షాకింగ్ డిసిషన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త లిప్ స్టిక్ రాసుకుని, మహిళలు ధరించే లో దుస్తులు వేసుకుంటున్నాడు. దీంతో ఓ మహిళ తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహిళలు ధరించే దుస్తులు ధరించడంతో పాటు వింతగా ప్రవరిస్తున్నాడని సదరు మహిళ తెలిపింది. అదనపు కట్నం కోసం అత్తమామాలతో కలిసి వేధిస్తున్నాడని కంప్లైంట్ లో తెలిపింది. 25 ఏళ్ మహిళ ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. నిందితుడికి మూడేళ్ల క్రితం మ్యాట్రిమోని ద్వారా మహిళ పరిచయం అయింది.

ఆ సమయంలో తాను ఎంటెక్ పూర్తి చేసి మంచి జాబ్ చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. తర్వాత వీరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, కేజీ వెండి, రూ.5లక్షల కట్నం ఇచ్చారు. పెళ్లయిన తొలిరాత్రి భర్త అద్దం ముందు నిల్చుని లిప్ స్టిక్ రాసుకున్నాడని సదరు మహిళ తెలిపింది. ఆడవాళ్ల లోదుస్తులు ధరించడంతో ఏంటని ప్రశ్నించగా తనకు మగవాళ్లంటే ఇష్టమని చెప్పడంతో మహిళ షాక్ కు గురైంది. లాక్ డౌన్ సమయంలో వివాహం జరగగా తరచూ గొడవలు జరిగేవని మహిళ తెలిపింది. ఇటీవల వేధింపులు అధికమవంతో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed