- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందంగా కనిపించవద్దని భార్యకు గుండు కొట్టిన భర్త
భార్య అందంగా ఉంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ ఓ భర్తకు మాత్రం తన భార్య అందంగా ఉండటం తలనొప్పిని తీసుకువచ్చింది. అందరూ తన భార్యనే చూడటంతో తట్టుకోలేకపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: భార్య అందంగా ఉంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ ఓ భర్తకు మాత్రం తన భార్య అందంగా ఉండటం తలనొప్పిని తీసుకువచ్చింది. అందరూ తన భార్యనే చూడటంతో తట్టుకోలేకపోయాడు. భార్య అందంగా ఉందని మురిసిపోవాలో పక్కవాళ్లు ఆమెనే చూస్తున్నారని బాధపడాలో అర్థం కాలేదు. దానికి తోడు అనుమానం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఎలాగైనా అందవిహీనంగా ఎవరి కన్ను పడకుండా చేయాలని అనుకున్నాడు. దాని కోసం ఆమెకు ఏకంగా గుండు గీసేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్ కోట జిల్లా తొదలబాగిలో చోటు చేసుకుంది. ఉమేశ్, లక్ష్మీ బాయి ఇద్దరూ భార్య భర్తలు.
అయితే భార్యకు పొడవాటి జడ ఉండటం వాటిని ఆమె అందంగా అలంకరించుకోవడం చూసి ఉమేశ్ ఓర్చుకోలేకపోయాడు. తన భార్య యువకులను ఆకట్టుకుంటోందని అనుమానంతో రగిలిపోయాడు. ఇది ఇలానే కొనసాగితే తన కొంప కొల్లేరు అవుతుందని అనుకున్నాడో ఏమో గానీ సోమవారం రాత్రి ఇంటికి ఫుల్లుగా తాగి వచ్చాడు. భార్యతో గొడవపడగా చివరకు చెరుకు నరికే రేజర్ కత్తితో ఆమెపై బెదిరింపులకు పాల్పడి గుండు చేశాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉమేషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ ఘటన వైరల్ అవ్వడంతో అసలు అందమైన భార్యను ఎవరు చేసుకోమన్నారు.. చేసుకున్న తరవత అనుమానించమని ఎవరు చెప్పారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.






