భార్యను చంపిన భర్త.. పసికందును వీధిలో పడేసిన కుటుంబం

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్‌లోని బదర్ఖా గ్రామంలో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. భార్యను కొట్టి చంపాడు భర్త. ఆ తర్వాత పిల్లలను వీధిలో పడేసింది కుటుంబం.

భార్యను చంపిన భర్త.. పసికందును వీధిలో పడేసిన కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్‌లోని బదర్ఖా గ్రామంలో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. భార్యను కొట్టి చంపాడు భర్త. ఆ తర్వాత పిల్లలను వీధిలో పడేసింది కుటుంబం. అశోక్, మోనికకు రెండున్నరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ముందు బాగానే ఉన్నా అశోక్ తాగుడుకు బానిసయ్యాడు. డబ్బుల కోసం మోనికను టార్చర్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న డబ్బులు అడిగాడు భర్త.

కానీ ఆమె లేవని చెప్పడంతో వాగ్వాదం జరిగింది. తర్వాత దారుణంగా కొట్టాడు. అంతర్గత గాయాలు, కడుపులో రక్తస్రావం కారణంగా ఆమె మరణించినట్లు పోస్టుమార్టమ్ రిపోర్ట్ నిర్ధారించింది. మర్డర్ కేసు కింద అశోక్‌ను అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరు పిల్లలు.. ఒకటిన్నర సంవత్సరాలున్న కుమార్తె, నాలుగు నెలల కుమారుడిని.. కుటుంబీకులు వీధిలో పడేశారు. దీంతో గందరగోళం నెలకొంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న మోనిక కజిన్స్.. చిన్న పిల్లలను తీసుకుని వారి ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లారు.

Next Story