- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో ఘోరం.. తాగించి.. కాళ్లు, చేతులు కట్టేసి.. గొంతు పిసికి., బైక్‌కు కట్టేసి కిలోమీటర్లు లాక్కెళ్లి.. భర్త దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళ్తే.. నేహా రౌనియార్, నాగేశ్వర్ రౌనియార్ ఇద్దరు దంపతులు. కాగా వీరి షాపులో పని చేసే జితేంద్ర అనే వ్యక్తితో

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. వివరాల్లోకి వెళ్తే.. నేహా రౌనియార్, నాగేశ్వర్ రౌనియార్ ఇద్దరు దంపతులు. కాగా వీరి షాపులో పని చేసే జితేంద్ర అనే వ్యక్తితో నేహాకు ఇల్లీగల్ ఎఫైర్ ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ భర్త నాగేశ్వర్ అడ్డుగా ఉండటంతో అతన్ని తొలగించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే జితేంద్ర ఉంటున్న అద్దె ఇంట్లోకి భోజనానికి ఇన్వైట్ చేసినట్లుగా నమ్మించి.. అతన్ని అక్కడకు రప్పించారు. భారీగా ఆల్కహాల్ తాగించి.. స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి.. గొంతు పిసికి చంపేశారు. కేసు తమ మీదకు రాకుండా యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు.. బాడీని బైక్‌కు కట్టి దాదాపు 25 కిలోమీటర్లు లాక్కెళ్లారు. కానీ 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులు.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.






