మేనల్లుడితో వివాహేతర సంబంధం.. భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌కు చందిన సతేంద్ర యాదవ్(33), రోషిణి(30) భార్యాభర్తలు. కొన్నాళ్లు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ సతేంద్ర మేనల్లుడు గోవింద్ ఎంటర్ కావడంతో భార్యాభర్తల పవిత్ర బంధం బీటలు వారింది. గోవింద్‌తో రోషిణి

మేనల్లుడితో వివాహేతర సంబంధం.. భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్‌కు చందిన సతేంద్ర యాదవ్(33), రోషిణి(30) భార్యాభర్తలు. కొన్నాళ్లు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ సతేంద్ర మేనల్లుడు గోవింద్ ఎంటర్ కావడంతో భార్యాభర్తల పవిత్ర బంధం బీటలు వారింది. గోవింద్‌తో రోషిణి వివాహేతర సంబంధం పెట్టుకుని.. భర్తను అడ్డుతొలగించేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు ప్రియుడి సహాయం తీసుకుంది. ఇద్దరు కలిసి ఈ ఏడాది జనవరి 14న సతేంద్ర గొంతు నులిమి చంపేశారు. సతేంద్ర సోదరుడు శతుఘన్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాదాపు హత్య జరిగిన 10 నెలల తర్వాత కోర్టు నిందితులను దోషులుగా గుర్తించింది. ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అదనంగా ప్రతి ఒక్కరికి రూ. 20,000 జరిమానా విధించింది.

Next Story