- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త
అనుమానం పెనుభూతమై ఒకరి హత్యకు దారి తీసిన సంఘటన మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, చైతన్యపురి : అనుమానం పెనుభూతమై ఒకరి హత్యకు దారి తీసిన సంఘటన మంగళవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా, తొండంగి మండలం, కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియా దాస్(35) తకాడ అమ్ములు( 30) 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె మహి అశ్విని (11), ఒక కుమారుడు నితిన్ (7) ఉన్నారు. గత మూడేళ్లుగా సరూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు.
మరియాదాస్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా అమ్ములు ఇండ్లలో పని మనిషిగా పనిచేస్తుంది. భార్యభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి అక్రమ సంబంధాలపై అనుమానాలు ఉన్నాయని ఇది తరచుగా గొడవలకు దారితీసిందని తెలిపారు. ఈనెల 9 రాత్రి 10 గంటల సమయంలో వారిద్దరూ గొడవపడ్డారు. ఈక్రమంలో ఈ నెల 10 మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో, మరియాదాస్ అమ్ములును చున్నీతో ఉరివేసి హతమార్చాడు. ఆ తర్వాత అతను వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తున్న తన మామ అర్జునకు సమాచారం అందించాడు.
హుటాహుటిన అర్జున తన కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా తన కుమార్తె మరణించినట్లు గమనించాడు. నా అల్లుడు మరియదాస్ తన కుమార్తె అమ్ములును వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో చున్నీతో ఉరివేసి హత్య చేశాడని అర్జున ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు.






