- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా భార్య అలాంటిది అందుకే చంపేశా.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త
యూపీలోని కాన్పూర్ లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఫతేపూర్ జిల్లాలోని మోహన్ పూర్ గ్రామానికి చెందిన సచిన్ శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని కాన్పూర్ లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త భార్యను హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఫతేపూర్ జిల్లాలోని మోహన్ పూర్ గ్రామానికి చెందిన సచిన్ శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న ఈ జంట కాన్పూర్ లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది. సచిన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా శ్వేత ఇంట్లోనే ఉంటుంది. అయితే భర్త వేరేవాళ్లతో అక్రమసంబంధం పెట్టుకుంది అనే అనుమానం రావడంతో సచిన్ ఆమెను హత్య చేశాడు. అనంతరం దుప్పటిలో డెడ్ బాడీని చుట్టు నాలుగు గంటల పాటు నగరంలోనే తిరిగాడు. చివరికి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
తన భార్య ఇంటికి దగ్గరగా నివసిస్తున్న విద్యార్థులతో అక్రమ సంబంధం పెట్టుకుందని నిందితుడు పోలీసుల ఎదుట చెప్పుకొచ్చాడు. ఆమె ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయని అవి ఎక్కడ నుండి వచ్చాయని అడిగితే మా అమ్మమ్మ పంపిందని అబద్దాలు చెబుతుందన్నాడు. అంతే కాకుండా ఓ రోజు తాను ఇంటికి రావడంలేదని చెప్పగా ఆమె మరో వ్యక్తిని ఇంటికి పిలిచిందని ఇద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చెప్పాడు. ఈ విషయంలో భార్యతో గొడవ జరగ్గా చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నాడు. పోలీసులు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కూడా తన భార్య వేరే వ్యక్తితో ఉంటానని బెదిరింపులకు పాల్పడిందన్నాడు. ఆ కోపంలో ఆమెను హత్య చేశానని మొదట పారిపోవాలని అనుకున్నా భయంతో పోలీస్ స్టేషన్ కు వచ్చానన్నాడు. ప్రస్తుతం నిందితుడి వీడియో వైరల్ అవుతోంది.






