- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో భార్య హత్య.. ఆపై లారీలో తీసుకెళ్లి..
by Naga Rani Yarlagadda |
అనుమానంతో భార్యను హత్య చేసి ఆపై లారీలో తీసుకెళ్లి అడవిలో పడేశాడో భర్త.

X
దిశ, వెబ్‌డెస్క్: అనుమానం పెనుభూతమై తన భార్యను హత్య చేశాడో భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్.. తాడిపత్రి పట్టణానికి చెందిన శ్రీలేఖ (26)ను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఇటీవల తరచూ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తుండేవాడు. ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానం రోజురోజుకూ బలపడటంతో భార్యకు దూరంగా ఉంటున్నారు. ఏం జరిగిందో కానీ గత రాత్రి తాడిపత్రిలో ఉన్న శ్రీ లేఖను ఎల్లనూరు రోడ్డు సమీపంలో మర్డర్ చేశాడు. ఆపై మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి ముచ్చుకోట అటవీప్రాంతంలో పడేశాడు. భార్యను తానే చంపానంటూ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
Next Story






