భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య..

by Taduka Kalyani |

ఓ కేసు విషయంలో భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య..
X

దిశ, అల్లాదుర్గం: ఓ కేసు విషయంలో భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త జైలు జీవితం అనుభవించి ఇంటికి వచ్చి తన భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆగమయ్య (33) ఓ కేసు విషయంలో జైలు జీవితం అనుభవించి విడుదలయ్యారు. అప్పటికే తల్లిగారింటికి వెళ్లిన తన భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. చివరికి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రాత్రి దులానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.

Next Story