ఛీ..ఛీ భర్త బంగారం అమ్మి చదివిస్తే అలాంటి పనులా..నెట్టింట వీడియో వైరల్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-24 16:17:48  IST  )

ఒకప్పుడు పురుషులు మహిళలను మోసం చేసిన కేసులు ఎక్కువగా నమోదవ్వగా ఇప్పుడు మహిళలు పురుషులను మోసం చేస్తున్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఛీ..ఛీ భర్త బంగారం అమ్మి చదివిస్తే అలాంటి పనులా..నెట్టింట వీడియో వైరల్!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఒకప్పుడు పురుషులు మహిళలను మోసం చేసిన కేసులు ఎక్కువగా నమోదవ్వగా ఇప్పుడు మహిళలు పురుషులను మోసం చేస్తున్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేశార‌ని, పెళ్లి పేరుతో చంపేశారని ఇలా రోజుకో ఘ‌ట‌న వెలుగులోకి వ‌స్తోంది. పెళ్లైన త‌ర‌వాత మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని భ‌ర్త‌ల‌ను మోసం చేసిన ఘ‌ట‌న‌లు సైతం చాలా పెరిగిపోయాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. తన భార్యను ఓ వ్యక్తి కష్టపడి చదివించగా తోటి ఉద్యోగితోనే ఎఫైర్ పెట్టుకుని అడ్డంగా దొరికిపోయింది.

ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను ఎంతో కష్టపడి చదివించాడు. అతడి దగ్గర డబ్బులు లేని సమయంలో తన తల్లి బంగారం అమ్మేసి మరీ భార్య చదువులకు ఖర్చు చేశాడు. చివరికి అతడి కష్టానికి ప్రతిఫలంగా భార్యకు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది.

కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఉద్యోగం వచ్చిన కొద్దిరోజులకే తన తోటి ఉద్యోగితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన భర్త ఆమెను ఫాలో అయ్యాడు. చివరికి ఆమె తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో ఆమె అమాయకంగా యూనిఫామ్ వేసుకుని బయటకు రాగా ఆమె ప్రియుడు బెడ్ కింద నుండి నెమ్మదిగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భర్త కష్టపడి చదివిస్తే ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Next Story