- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. భార్యను కిరాతకంగా కొట్టి చంపిన భర్త
by Gantepaka Srikanth |
8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. భార్యను కిరాతకంగా కొట్టి చంపిన భర్త

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్(Vikarabad) జిల్లా తాండూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరమేష్ - అనూష అనే ఇద్దరు ఎనిమిది నెలల క్రితం లవ్ మ్యారేజ్(Love Marriage) చేసుకున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు పెరిగి గొడవలు స్టార్ట్ అయ్యాయి. అవి కాస్త గురువారం ముదరడంతో భర్త - భార్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపం ఆపుకోలేకపోయిన భర్త పరమేశ్.. విచక్షణారహితంగా అనూషపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అనూష(22) అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో భయాందోళన చెందిన పరమేశ్(28) అక్కడినుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్త పరమేశ్ కోసం గాలిస్తున్నారు. హత్యకు సంబంధించిన కారణాలు తెలియరాలేదు.
Next Story






