- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. భార్య ముక్కు, పెదవులు కోసిన భర్త.. పరిస్థితి విషమం.. కారణం ఇదే!
ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనతేర్‌లో భార్య ముక్కు, పెదవులు కోసిన భర్త పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనతేర్‌లో భార్య ముక్కు, పెదవులు కోసిన భర్త పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. కుందర్కి చెందిన రబియా.. ముందుగా సంభాల్ జిల్లా చందౌసికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరు కుమారులు పుట్టాక విభేదాలతో విడాకులు తీసుకుంది. భరణం కింద ఆమెకు మైనతేర్‌లో ఓ ఇంటిని రాసిచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
అయితే కొన్నాళ్లకు రబియా.. చాంద్ పాషాను రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బిడ్డ కూడా. కానీ భర్త హింసించడం ఎక్కువైంది. భరణంగా ఇంటిని కూడా అమ్మేసిన చాంద్.. ఇద్దరు కొడుకులను చంపేస్తానని బెదిరించడం, ఇరుగుపొరుగు వారితో గొడవ పెట్టుకోవడం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా గొడవ పడిన ఆయన.. గ్యాస్ సిలిండర్ పేల్చి ఇంటిని తగలబెట్టేస్తానని, అందరినీ చంపేస్తానని బెదిరించగా.. రబియా ఎలాగోలా శాంతపరిచింది. ఇక తెల్లారాక పనికి పొమ్మని రబియా చాంద్‌కు సూచించడంతో గొడవ మళ్లీ స్టార్ట్ అయింది. ఆమెపై దాడి చేసిన భర్త.. ముక్కు, పెదవులు కోశాడు. పాల కోసం షాపుకు వెళ్లొచ్చిన రబియా కూతురు తల్లిని రక్తపు మడుగులో చూసి కేకలు పెట్టగా.. రబియా తల్లి ఆమెను ఆస్పత్రికి తరలిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.






