TG: పుట్టింట్లో ఉరేసుకున్న భార్య.. విషయం తెలిసి భర్త కూడా ఆత్మహత్య

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ పరిధి చిన్నతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

TG: పుట్టింట్లో ఉరేసుకున్న భార్య.. విషయం తెలిసి భర్త కూడా ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఐలాపూర్(Ailapur) పరిధి చిన్నతండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్య అనూష(25) ఇటీవల పుట్టింటికి వచ్చింది. తీవ్ర మనస్థాపంతో సోమవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి భర్త లాల్‌శేఖర్ కూడా ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ విభేదాల కారణంగా గతకొన్నాళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు అయితే.. ఉపాధి కోసం ఐలాపూర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఇరు కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యలకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story