Crime News: భార్యభర్తలు దారుణ హత్య.. అసలు ఆ అర్థరాత్రి ఏమైదంటే ?

by Disha Web |
Crime News: భార్యభర్తలు దారుణ హత్య.. అసలు ఆ అర్థరాత్రి ఏమైదంటే ?
X

దిశ కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతరలో భార్యాభర్తలు ఇరువురు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన నిమ్మన్న గారి లక్ష్మారెడ్డి (55), నిమ్మన్నగారి లక్ష్మి (50)లు మంగళవారం రాత్రి దారుణంగా మృతి చెందారు. రాత్రి ఇంట్లో నిద్రించిన సమయంలో ఇంట్లో వచ్చే కరెంటు వైర్ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు మొదటగా లక్ష్మారెడ్డి భార్య లక్ష్మి‌ని, పదునైన ఆయుధాలు‌తో తలపై బాది చంపారు. అనంతరం లక్ష్మారెడ్డి తన ఇంటి సమీపంలోని గూడెం రామ్ రెడ్డి‌కి చెందిన పశువుల పాకలో చంపి అందులో ఉన్న గదిలో పడేశారు. సంఘటన స్థలం‌ను మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ సీఐ విజయ్, ఏఎస్ఐ తారా సింగ్‌లు సందర్శించారు. మృతుల కూతురు కవిత ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed