- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు ఆరోగ్యం కోసం పదేళ్ల బాలుడి నరబలి.. ఎక్కడంటే?
మూఢనమ్మకాల ముసుగులో పదేళ్ల బాలుడిని బలిచ్చిన దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మూఢనమ్మకాల ముసుగులో పదేళ్ల బాలుడిని బలిచ్చిన దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. తాంత్రికుడి మాటలు నమ్మి సొంత బంధువే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణ వర్మ అనే వ్యక్తికి వివేక్ వర్మ(10) కుమారుడు ఉన్నాడు. కృష్ణ వర్మకు అదే గ్రామంలో అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్‌కు రెండున్నరేళ్ల కుమారుడు ఉండగా తరచూ మానసిక అనారోగ్యానికి గురువుతున్నాడు.
ఎంతమంది వైద్యులకు చూయించిన నయం కాకపోవడంతో అనూప్ ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి ఇస్తే కొడుకు ఆరోగ్యం బాగుంటుందని ఆ తాంత్రికుడు అనూప్‌కు సూచించాడు. తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్ మేనమామ చింతారామ్‌తో కలిసి గురువారం రాత్రి వివేక్ వర్మను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్మ ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు కోసి మర్డర్ చేసి పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించగా ఇంటి సమీపంలోని పొలాల్లో వివేక్ వర్మ మృతదేహం లభ్యమైంది. కాగా పోలీసుల దర్యాప్తులో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తాంత్రికుడితో పాటు, అనూప్, అతనికి సహకరించిన చింతారామ్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.






