- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యి సీజ్.. రూ.18.26 లక్షల సామగ్రి స్వాధీనం
తిరుమలలో కల్తీ నెయ్యిపై వివాదం కొనసాగుతోన్న వేళ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా కల్తీ నెయ్యిని సీజ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరం నడిబొడ్డున భారీగా సాగుతున్న కల్తీ నెయ్యి దందాను పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ నెయ్యితో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పరిధిలోని ఓ నివాస ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై నిఘా ఉంచిన అధికారులు బుధవారం ఆకస్మికంగా మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో సుమారు మొత్తం 460 కిలోల కల్తీ నెయ్యిని కనిపెట్టారు. మార్కెట్‌లో ఆ నెయ్యి విలువ రూ.18.26 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న నకిలీ ప్యాకెట్లు, సీళ్లు, ప్యాకేజింగ్ యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. వీటి ద్వారా వినియోగదారులను నమ్మించి మార్కెట్లోకి ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. అనంతరం కల్తీ నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.






