TG High Court: కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు భారీ ఊరట

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

TG High Court: కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫేక్ వీడియో సృష్టించారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కమార్) పెట్టిన కేసును హైకోర్టు(Telangana High Court) కొట్టేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనపై ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఫేక్ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు భారీ ఉపశమనం లభించింది.

Next Story