నిజామాబాద్‌లో లారీ బీభత్సం.. రెండు కార్లు, ఒక బైకును ఢీ

by Gantepaka Srikanth |

నిజామాబాద్‌(Nizamabad)లోని ఇందల్వాయి పరిధి చంద్రయాన్‌పల్లి వద్ద లారీ(Lorry Accident) బీభత్సం సృష్టించింది.

నిజామాబాద్‌లో లారీ బీభత్సం.. రెండు కార్లు, ఒక బైకును ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌(Nizamabad)లోని ఇందల్వాయి పరిధి చంద్రయాన్‌పల్లి వద్ద లారీ(Lorry Accident) బీభత్సం సృష్టించింది. 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న రెండు కార్లు, ఒక బైకును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక కారు డివైడర్‌ను ఢీకొట్టగా, మరో కారు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. బైకుపై వెళతున్న వారు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ప్రమాదం కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో క్లియర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story