- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఏం తెలివిరా బాబూ’.. ఐరన్ బాక్స్‌లో బంగారం తరలింపు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport)లో భారీగా బంగారం పట్టుబడింది.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport)లో భారీగా బంగారం పట్టుబడింది. చట్టవిరుద్ధంగా తరలిస్తున్న 3.38 కిలోల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఐరన్ బాక్స్‌లో బంగారం(Gold) తరలించే ప్రయత్నం చేశారు. చాలా చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకున్నట్లు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బంగారం స్వాధీనం(Huge Gold Seize) చేసుకున్నారు. బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అధికారులు తేల్చారు. బంగారం ధరలు లక్ష రూపాయాలకు చేరువైన నేపథ్యంలో తక్కువ ధరకు లంభించే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసి.. ఇక్కడ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది.






