- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
by Satheesh |
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బెంగాల్‌లోని మెదినిపూర్ జిల్లా ఎగ్రాలోని ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బెంగాల్‌లోని మెదినిపూర్ జిల్లా ఎగ్రాలోని ఓ బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అందులో పని చేసే ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. భారీగా మంటలు ఎగసిపడటంతో ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






