Turkey Earthquake LIVE: టర్కీలో భారీ భూకంపం.. 100 మంది మృతి!

by Disha Web |
Turkey Earthquake LIVE: టర్కీలో భారీ భూకంపం.. 100 మంది మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభంచింది. ఈ భూకంపం ధాటికి దాదాపు వందమంది చనిపోయినట్లు సమాచారం. కాగా, రెండు దేశాల్లో విధ్వంసం సృష్టించిన ఈ భూకంప కేంద్రాన్ని టర్కీలోని నుర్దిగికి 23 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ ప్రకంపనల ధాటికి టర్కీ, సిరియా దేశాల్లో పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలిపోయాయి. సహయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు భవనాలు కూలి సిరియాలో 42 మంది, టర్కీలో 53 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Next Story

Most Viewed