ముంబై ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

by Ajay Maddhiboyina |

ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొలంబో నుండి వ‌చ్చిన మ‌హిళ‌ కాఫీ పౌడర్‌లో డ్రగ్స్ కలిపి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించారు.

ముంబై ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
X

దిశ‌, వెబ్ డెస్క్: ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొలంబో నుండి వ‌చ్చిన మ‌హిళ‌ కాఫీ పౌడర్‌లో డ్రగ్స్ కలిపి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించారు. కాఫీ పొడిలో తెల్ల‌గా క‌నిపించ‌డంతో అనుమానం వ‌చ్చి త‌నిఖీలు చేశారు. కాఫీ పొడిలో మొత్తం 4.7 కిలోల కొకైన్ ఉన్న‌ట్టు నిర్దారించారు. ఐదుగురు స్మగ్లర్లను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. నింధితుల‌పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసులు న‌మోదు చేశారు.

Next Story