ఎయిర్‌పోర్టులో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-18 14:52:48  IST  )

మహారాష్ట్రలోని ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో (Mumbai International Airport) భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి

ఎయిర్‌పోర్టులో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో (Mumbai International Airport) భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కస్టమ్స్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. శనివారం ఇద్దరు ప్రయాణికులు బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చారు. వారి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో అధికారులు వారిని తనిఖీ చేయగా, రూ.8.56 కోట్ల విలువైన 8.5 కిలోల హైడ్రోఫోనిక్ వీడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Next Story