- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను(African Womens) శుక్రవారం నార్కొటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరికి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తెలంగాణను డ్రగ్స్ రహితంగా రాష్ట్రంగా మార్చేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. ఇటీవల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో తరుచుగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల రహస్యంగా డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్టు పక్కా సమాచారం అందడంతో ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేసి అనేక మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్న వారితో పాటు డ్రగ్స్ విక్రేతలను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి డ్రగ్స్ లభ్యం కావడం నగరంలో కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు దర్యా్ప్తును వేగవంతం చేశారు.






