- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన భారీ భవనం.. ముగ్గురు దుర్మరణం, శిథిలాల కింద మరో 17 మంది!
భారీ భవనం కుప్పకూలి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా రెండంతస్థుల భవనం కుప్పకూలి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలో ఇవాళ ఉదయం 6 గంటలకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొడకర (Kodakora) పంచాయతీ పరిధిలో ఉన్న భారీ పురాతన భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు రుపెల్ (21), రాహుల్ (19), అలీమ్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది భవన శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బందితో చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అర్జున్ పాండియన్, ఎమ్మెల్యే కె.కె. రామచంద్రన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చలకుడి డీవైఎస్పీ పీసీ బిజుకుమార్, కొడకర, పుతుక్కడ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఫైర్ యూనిట్స్, ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్ కొ-ఆర్డీనేషన్‌తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కొడకర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






