- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDలో షాకింగ్ ఘటన.. ఆర్టీసీ బస్సులో భారీగా డ్రగ్స్ లభ్యం
మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ పోలీస్ స్టేషన్(Medchal Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 600 గ్రాముల డ్రగ్స్(Drugs)తో ఆర్టీసీ బస్సు(RTC Bus)లో ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని.. నిందితుడిని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు(Telangana Police) ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడొద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాటలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాదు.. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దీనికి డీజీ స్థాయి అధికారులను నియమించింది. పెద్ద ఎత్తున నిధులతో పాటు సిబ్బందిని కేటాయించింది.






