- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా బండినే ఆపుతారా’ అని అసహనం.. ట్రాఫిక్ హోంగార్డుపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దాడి
హైదరాబాద్ అబిడ్స్ పరిధిలో వాహన తనిఖీల్లో ఘర్షణ చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని అబిడ్స్ (Abids) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ అనిల్ (SI Anil) తన సిబ్బందితో కలిసి సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియమాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వచ్చిన ఓ బైకర్‌ను ఎస్ఐ అనిల్ పక్కకు ఆపారు. సదరు వాహనదారుడిని విచారించగా, అతను ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫైన్ వేసే క్రమంలో సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తప్పు ఒప్పుకోకుండా ఎస్ఐ అనిల్‌తో దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
అడ్డుకోబోయిన హోంగార్డుపై..
ఎస్ఐతో టెక్కీ గొడవ పడుతుండడం, గొంతు పెంచి ప్రవర్తిస్తుండడాన్ని గమనించిన హోంగార్డ్ కుమార్ (Kumar) అక్కడకు చేరుకున్నాడు. సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శాంతపరచడానికి, గొడవ ఆపేందుకు కుమార్ ప్రయత్నించాడు. అయితే, తీవ్ర ఆవేశంలో ఉన్న టెక్కీ.. హోంగార్డ్ కుమార్ సర్దిచెప్పడాన్ని తట్టుకోలేకపోయాడు. ‘నన్నే ఆపుతారా’ అంటూ ఒక్కసారిగా హోంగార్డ్ కుమార్‌పై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో హోంగార్డ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ దాడికి దిగడంతో అక్కడున్న ఇతర సిబ్బంది, వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు దాడికి పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ట్రాఫిక్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకు అబిడ్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.






