సిలిండర్ పేలి గాయపడిన గృహిణి మృతి

by Ratna Kumari |   (  Updated:2026-02-15 15:16:21  IST  )

మండల పరిధిలోనీ మారేడుమాన్ దిన్నె గ్రామంలో ఓ మహిళ ఈ నెల9న ఇంట్లో వంట చేసేందుకు సిలిండర్ వెలిగించగా.. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది.

సిలిండర్ పేలి గాయపడిన గృహిణి మృతి
X

దిశ, పెద్ద కొత్త పల్లి : మండల పరిధిలోనీ మారేడుమాన్ దిన్నె గ్రామంలో ఓ మహిళ ఈ నెల9న ఇంట్లో వంట చేసేందుకు సిలిండర్ వెలిగించగా.. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. పెద్ద కొత్త పల్లి ఎస్సై సతీష్ కథనం ప్రకారం.. ఇలా మారేడుమాన్ దీన్నే గ్రామానికి చెందిన మంగలి చిట్యాల దేవేంద్రమ్మ (51) తన ఇంట్లో ఈ నెల 9న రాత్రి స‌మ‌యంలో వంట చేసేందుకు గ్యాస్ సిలిండర్ వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు అంటుకొన్నాయి. దేవేంద్రమ్మకు బలమైన కాలిన గాయాల‌య్యాయి. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం దేవేంద్రమ్మ ప్రాణాలు విడిచింది. భర్త చిట్యాల వెంకటపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దకొత్తపల్లి ఎస్సై వి సతీష్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు క‌ల‌రు.

Next Story