అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య..
X

దిశ, బిచ్కుంద : భర్త, అత్త పెట్టే వేధింపులను తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్లారం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారం గ్రామానికి చెందిన మీసాల వినోద (30) ను తన భర్త సాయ గౌడ్, అత్త సత్యవ్వ శారీరకంగా, మానసికంగా గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేక బుధవారం రాత్రి వారి ఇంటి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. మృతురాలి తల్లి మనెవ్వ ఫిర్యాదు మేరకు భర్త, అత్త ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.

Next Story

Most Viewed