- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాఖీ కట్టిన చెల్లి.. రేప్ చేసి.. ఉరి తీసిన అన్న..
ఉత్తరప్రదేశ్ అరైయాలో దారుణం చోటు చేసుకుంది. రాఖీ కట్టిన చెల్లిపై రేప్ చేసి.. హత్య చేశాడు యువకుడు. పద్నాలుగేళ్ల బాలిక రాఖీ కట్టేందుకు 33ఏళ్ల సుర్జీత్ ఇంటికి వచ్చింది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ కట్టింది. కానీ ఆమె అతన్ని సోదరుడిగా భావించిన అతను మాత్రం అలా అనుకోలేదు. అందుకే

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అరైయాలో దారుణం చోటు చేసుకుంది. రాఖీ కట్టిన చెల్లిపై రేప్ చేసి.. హత్య చేశాడు యువకుడు. పద్నాలుగేళ్ల బాలిక రాఖీ కట్టేందుకు 33ఏళ్ల సుర్జీత్ ఇంటికి వచ్చింది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ కట్టింది. కానీ ఆమె అతన్ని సోదరుడిగా భావించిన అతను మాత్రం అలా అనుకోలేదు. అందుకే రాఖీ కట్టిన కొన్ని గంటల వ్యవధిలో చెల్లిని రేప్ చేశాడు. ఆ తర్వాత గొంతు బిగించి చంపి.. శవాన్ని ఉరితాడుకు వేలాడదీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మరుసటి రోజు ఉదయం బాలిక ఉరికి వేలాడుతూ చూసిన తండ్రి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సూసైడ్ మాదిరిగా ప్లాన్ చేసినా.. ఘటనా స్థలిలో రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ సమయంలో నిందితుడి వింత సమాధానాలతో మరింత అనుమానం పెరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్ రేప్ జరిగినట్లుగా స్పష్టం చేయగా.. సుర్జీత్‌ను గట్టిగా విచారించడంతో తానే ఇదంతా చేసినట్లు ఒప్పుకున్నాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.






