- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండెక్కిన బంగారం ధరలు.. శవంపై బంగారం దోచేసిన హాస్పిటల్ స్టాఫ్..(వీడియో)
ఆస్పత్రికి వెళ్లాలంటే భయం.. కారణం ఫీజుల మోత.. చెవి నొప్పి అని వెళ్లినా డాక్టర్లు చేసే పరీక్షలు, ట్రీట్మెంట్‌కు తడిసి మోపెడు అవుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోను చూస్తుంటే.. ఆస్పత్రులు శవాన్నిపీక్కుతింటాయా ఏంటి అనిపిస్తుంది. అవును..

దిశ, వెబ్ డెస్క్ : ఆస్పత్రికి వెళ్లాలంటే భయం.. కారణం ఫీజుల మోత.. చెవి నొప్పి అని వెళ్లినా డాక్టర్లు చేసే పరీక్షలు, ట్రీట్మెంట్‌కు తడిసి మోపెడు అవుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోను చూస్తుంటే.. ఆస్పత్రులు శవాన్నిపీక్కుతింటాయా ఏంటి అనిపిస్తుంది. అవును.. ఓ వృద్ధ మహిళను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు కుటుంబీకులు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు మరణించింది. మృతదేహాన్ని మార్చురీలో ఉంచగా.. ఆస్పత్రి స్టాఫ్ శవం మీద ఉన్న బంగారు కమ్మలు, బంగారు చైన్ దోచేస్తూ కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఇందుకు సంబంధించిన వీడియో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబీకులు పోలీసలకు ఫిర్యాదు చేయగా.. స్టాఫ్ మెంబర్ కేవలం కమ్మలు మాత్రమే తిరిగి ఇచ్చింది.
కాగా ఈ కేసు ఢిల్లీలోని గోయల్ ఆస్పత్రికి సంబంధించినది కాగా మాజీ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ గోయల్‌కు సంబంధించిన ఆస్పత్రి కావడంతో రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఇష్యూ కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఆలస్యం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.






