- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సదాశివపేట బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
by Taduka Kalyani |
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

X
దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డుపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు ద్విచక్ర వాహనదారుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






