ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 03:04:53  IST  )

బైక్‌ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (Tiruvuru) మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సమాచారం ప్రకారం.. లక్ష్మీపురం (Lakshmipuram) గ్రామ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒకే బైక్‌పై ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ వారిని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద ధాటికి బైక్ నుజ్జునుజ్జు అవ్వగా, బైక్‌పై ఉన్న ఐదుగురు యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి కాళ్లు, చేతులు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రహదారుల రక్త దాహం.. జాతీయ రహదారిపై నిత్య ప్రమాదాలు

Next Story