- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదాద్రి జిల్లాలో ఘోరం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఇద్దరు చిన్నారులను చంపి తల్లి కూడా బలవన్మరాణానికి పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబమే చిన్నాభిన్నమైంది. బీబీనగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మేకల మహేష్ యాదవ్ భార్య ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల వివరాల ప్రకారం.. దంపతుల మధ్య గత ఆరు నెలలుగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి అమ్మగారింటికి వెళ్లి ఉంటోంది. సోమవారం కుటుంబ సభ్యులు ఆమెను భర్త ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు. అయితే, సోమవారం రాత్రి ఐశ్వర్య తీవ్ర మనస్తాపంతో తన ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతిచెండంతో గొల్లగూడె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






