- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరం నడిబొడ్డున ఘోరం.. లేడీస్ హాస్టల్లో మహిళ అనుమానాస్పద మృతి
హైదరాబాద్ మధురానగర్‌లోని లేడీస్ హాస్టల్‌లో హారిక(40) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని మధురానగర్ (Madhura Nagar)లో ఘోరం వెలుగుచూసింది. స్థానిక ఒక లేడీస్ హాస్టల్‌లో నివసిస్తున్న హారిక (40) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్‌లోని బాత్రూంలో ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో లభించడం స్థానికంగా కలకలం రేపింది. మధురానగర్‌లోని ఓ లేడీస్ హాస్టల్‌లో హారిక గత కొంతకాలంగా ఉంటోంది. అయితే, గత 2 రోజులుగా ఆమె గది నుంచి బయటకు రాకపోవడం, ఇవాళ హాస్టల్ గది నుంచి దుర్వాసన రావడంతో తోటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, బాత్రూంలో హారిక మృతదేహం పడి ఉంది. హస్టల్ (Hostel) నిర్వాహకుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హారిక సుమారు 2 రోజుల క్రితమే బాత్రూంలో జారిపడి చనిపోయి ఉండవచ్చని, అనారోగ్య కారణాలతో మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, హరికది ఆత్మహత్యనా.. ఎవరైనా హతమార్చి ఉంటారా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రాభించారు.






