- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HONOR KILLING : గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు.. కానీ చదివిస్తే మాట వినదని బాలిక హత్య
నీట్ ఎగ్జామ్‌లో పాస్ అయింది.. పగలు రాత్రి తేడా లేకుండా చదివి 487 మార్కులు స్కోర్ చేసింది.. గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు కొట్టేసినట్లే.. ముందుగా తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు.. కానీ మామ మాత్రం కాస్త నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఆమెకు

దిశ, వెబ్ డెస్క్ : నీట్ ఎగ్జామ్‌లో పాస్ అయింది.. పగలు రాత్రి తేడా లేకుండా చదివి 487 మార్కులు స్కోర్ చేసింది.. గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు కొట్టేసినట్లే.. ముందుగా తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు.. కానీ మామ మాత్రం కాస్త నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఆమెకు ఏ కాలేజీ బెటర్ ఉంటుందని కొన్ని కాలేజీలను చూసేందుకు వెళ్లి తండ్రి, మామ.. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి తిరగడం చూసి షాక్ అయ్యారు. తమ పిల్లను చదివించినా ఇలాగే చేస్తుందని.. తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటుందని భావించారు. చంద్రిక దగ్గర సెల్ ఫోన్ లాగేసుకుని.. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలని హెచ్చరించారు. ఇంటి పనులు చేయాలని ఒత్తిడి చేశారు.
అయినా ఆ అమ్మాయి ఒప్పుకుంది. వారు చెప్పినట్లుగానే అన్నిటికి దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటుంది. కానీ వీరు మాత్రం అమ్మాయిని చంపేందుకు ప్లాన్ చేశారు. తమకు తెలియకుండా ప్రేమ, పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని ముందుగానే ఊహించుకుని.. పరువు హత్యకు పాల్పడ్డారు. చంద్రిక తాగే పాలలో మత్తు మందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్లి.. దుపట్టాతో గొంతు బిగించి చంపేశారు. అయితే ఆ తర్వాత ఆమె మామ చంద్రిక హార్ట్ ఎటాక్‌తో చనిపోయిందని కొందరికి, ఆత్మహత్య చేసుకుందని కొందరికి చెప్పాడు. దీంతో అనుమానాలు మొదలు కాగా తమదైన స్టైల్‌లో విచారించిన పోలీసులు.. బాలికను చంపింది తండ్రి, మామ అని గుర్తించారు. గుజరాత్ బనస్కంతలో ఈ దారుణం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.






