హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు స్పాట్ డెడ్.. మరొకరి పరిస్థితి సీరియస్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ శివారులో హిట్ అండ్ రన్ కేసు(Hit-And-Run Case) నమోదైంది.

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. ఒకరు స్పాట్ డెడ్.. మరొకరి పరిస్థితి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులో హిట్ అండ్ రన్ కేసు(Hit-And-Run Case) నమోదైంది. ప్రదీప్ అనే ఓ వ్యక్తి కారులో అతివేగంగా ప్రయాణిస్తూ.. బైకుపై వెళ్తోన్న యువతీ, యువకుడిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌(Abdullahpurmet) మండలం కోహెడ(Koheda)లో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తి కారుతో పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story