- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. నవవధువు మృతి
హైదరాబాద్ బండ్లగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువును డీఎం ఢీ కొట్టగా ఆమె అక్కడికక్కడే మరణించింది. మహిళ తన భర్తతో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బండ్లగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువును డీఎం ఢీ కొట్టగా ఆమె అక్కడికక్కడే మరణించింది. మహిళ తన భర్తతో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ యాక్టివా స్కూటిని ఢీ కొట్టిన తరవాత ఆగకుండా అక్కడ నుండి పారిపోయాడు. సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. మహిళ భర్తకు సైతం గాయాలు అవ్వడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. యాక్సిడెంట్ తరవాత భారీగా జనాలు రావడంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఇక నగరంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగడం ఆందోళనకరంగా మారింది. రోడ్డుపై ఢీసీఎం ఢీకొట్టి మరణించింది అంటే సిటీలో భారీ వాహనాన్ని వేగంగా నడపడంపై ప్రజలు మండిపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






