హైకోర్టు న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సీఏ విద్యార్థి మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-03 09:04:43  IST  )

చిన్న చిన్న కారణాలతో పెరుగుతున్న ఒత్తిడిని భరించలేక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి.

హైకోర్టు న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సీఏ విద్యార్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్న చిన్న కారణాలతో పెరుగుతున్న ఒత్తిడిని భరించలేక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. పెళ్లి అవ్వడం లేదని ఒకరు, ఉద్యోగ ఒత్తిడితో మరొకరు, లవ్ ఫెయిల్యూర్ తో ఇంకొకరు, అప్పులు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాలు ఇలా అనేక కారణాలతో ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా కన్నవారికి కడుపుకోత మిగులుతోంది. తాజాగా ఓ సీఏ విద్యార్థి.. అప్పులు, కుటుంబ కలహాల కారణంగా తల్లి, చెల్లితో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీకి చెందిన స్నేహా అఖోరి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కొడుకు మిహిర్ కోల్ కతాలో సీఏ పూర్తిచేసి ఇటీవలే రాంచీలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆమెకు 14 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇటీవల కుటుంబంలో అప్పులు పెరిగిపోవడం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి స్నేహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మిహిర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహా, కూతురు కొనఊపిరితో ఉండగా.. స్థానికులు గమనించి గురునానక్ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం.. ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి మెడికల్ రిపోర్ట్స్, మిహిర్ పోస్టుమార్టం రిపోర్ట్ పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. వీరి ఆత్మహత్యాయత్నానికి అప్పులు, కుటుంబ కలహాలే కారణమా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story