ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-08 05:33:39  IST  )

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పర్యాటకులతో గంగోత్రి సైట్ సీయింగ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ గంగ్నాని అటవీ ప్రాంతంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గంగ్నాని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో మరణించిన వారు ఎక్కడి వారు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story