సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. కాలిబూడిదైన హెలికాప్టర్

by Gantepaka Srikanth |

సినిమా షూటింగ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సినిమా షూటింగ్(Movie Shooting) కోసం ఏర్పాటు చేసిన డమ్మీ హెలికాప్టర్ దగ్ధమైంది.

సినిమా షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. కాలిబూడిదైన హెలికాప్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా షూటింగ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సినిమా షూటింగ్(Movie Shooting) కోసం ఏర్పాటు చేసిన డమ్మీ హెలికాప్టర్ దగ్ధమైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాచకొండ(Rachakonda) కమిషనరేట్‌ పరిధిలోని గుర్రంగూడాలో చోటుచేసుకుంది. గుర్రంగూడాలోని పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఇటీవల సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ నిమిత్తం ఓ డమ్మీ హెలికాప్టర్‌ను తెచ్చి అక్కడ పెట్టారు. కదపకుండా ఒకేచోట కొన్ని రోజులుగా అలాగే పెట్టారు. శుక్రవారం అనూహ్యంగా ఆ హెలికాప్టర్ దగ్ధమైంది. అయితే.. గుర్తుతెలియని వ్యక్తులు మంటలు అంటించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల దేశంలో జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్ దగ్ధం కావడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story