భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఎలక్ట్రికల్ సామగ్రి

by Kema Shiva Kumar |

జహీరాబాద్ పట్టణంలోని శంకర్ ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఎలక్ట్రికల్ సామగ్రి
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని శంకర్ ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున షాక్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో దుకాణంలోని వస్తువులు, ఎలక్ట్రానికల్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అదేవిధంగా మంటలు పక్క దుకాణాలకు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది సమర్థవంతంగా నిరోధించడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గ కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story