- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చావు చెప్పి రాదంటే ఇదేనేమో..అప్పటి వరకు మాట్లాడి అంతలోనే!
ఎవరైనా చనిపోయినప్పుడు చావు చెప్పిరాదు అనే సామెత వినిపిస్తుంది. అయితే ఈ మధ్య మరణాలు చూస్తుంటే

దిశ, వెబ్ డెస్క్: ఎవరైనా చనిపోయినప్పుడు చావు చెప్పిరాదు అనే సామెత వినిపిస్తుంది. అయితే ఈ మధ్య మరణాలు చూస్తుంటే మాత్రం ఆ సామెత కచ్చితంగా సరిపోతున్నట్టే అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరిని మృత్యువు ఎలా కబలించివేస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అప్పటి వరకు సంతోషంగా, ఆనందంగా గడిపినవారు సైతం ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి మరణాలు పెరిగిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా క్షణాల్లో కిందపడిపోయి గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. 25 ఏళ్ల అభిషేక్ అనే న్యాయవాది నిలబడి ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. అతడి పక్కనే ఉన్న వ్యక్తికి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు.
ఉన్నట్టుండి గోడకు వాలుతూ అభిషేక్ పూర్తిగా స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు పోలీసులు నిర్దారించారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి మరణాలకు కారణం అధిక ఒత్తిడి, లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం అని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తరవాతనే ఇలాంటి మరణాలు పెరిగిపోయాయని కొందరు వాదిస్తున్నారు.






