- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
by Gantepaka Srikanth |
సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణకు సహకరించలేదని సిట్ అధికారులు పేర్కొన్నారు. గతనెల 18వ తేదీన జరగాల్సిన విచారణలో ప్రభాకర్ రావు తరపున అడ్వకేట్ అందుబాటులోకి లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం మరోసారి పూర్తిస్థాయిలో కేసు విచారణ చేపట్టనుంది. డిజిటల్ ఎక్విప్‌మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనలను వినిపించారు. దీంతో బుధవారం నాటి విచారణ కీలకం కానుంది.
Next Story






