బండి భగీరథ్ కేసు: పోలీసుల కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Gantepaka Srikanth |

బండి భగీరథకు సంబంధించిన కస్టడీ పిటిషన్ విచారణను మల్కాజ్గిరి పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది.

బండి భగీరథ్ కేసు: పోలీసుల కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: బండి భగీరథకు సంబంధించిన కస్టడీ పిటిషన్ విచారణను మల్కాజ్గిరి పోక్సో (POCSO) ప్రత్యేక కోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. భగీరథన్ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మళ్లీ ఆ రోజున విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే.. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు, నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ విచారణాధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం, న్యాయస్థానం ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

కేసు నేపథ్యం..

గతంలో బండి భగీరథపై ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పాటు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, తీవ్రమైన 'పోక్సో' (బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు భగీరథను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా.. ఇప్పుడు కోర్టు నిర్ణయంపై అందరి దృష్టి నెలకొంది. ఈనెల 26న కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తుందా లేదా అనేది తేలనుంది.

Next Story