- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్లపై దాన్యం కుప్పలు.... ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి..
దిశ, అల్లాదుర్గం : వరి ధాన్యం రోడ్లపై ఆరబెట్టి కుప్పలు కుప్పలుగా పేర్చటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై

దిశ, అల్లాదుర్గం : వరి ధాన్యం రోడ్లపై ఆరబెట్టి కుప్పలు కుప్పలుగా పేర్చటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీస్ అధికారులు రైతులకు పలుమార్ లు హెచ్చరించిన ఫలితం లేకపోయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామం 161 వజాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై ఆదివారం రాత్రి వరి ధాన్యం ఆరబోసి కుప్పలు పేర్చడం వల్ల ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందినట్టు ఎస్సై శంకర్ తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామానికి చెందిన హమ్మద్ హుస్సేన్ (57) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం అల్లాదుర్గంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయ దర్శనానికి ప్యాసింజర్ ను దిగపెట్టి తిరిగి తన గ్రామానికి వెళ్తున్న క్రమంలో సర్వీస్ రోడ్లో ఆరబెట్టి కుప్పలుగా పోసిన వరి ధాన్యం చీకట్లో కనిపించకపోవడంతో సమాధానం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా డ్రైవర్ మమ్మద్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని కుమారుడు జావిద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.






