త‌ల్లిని, కొడుకును చంపి.. తాను ఆత్మహ‌త్య‌..!

by Ratna Kumari |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండ‌లంలోని వ‌డ్లూరులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌న్న‌ త‌ల్లిని, కుమారుడిని చంపి.. ఆ త‌రువాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పై స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

త‌ల్లిని, కొడుకును చంపి.. తాను ఆత్మహ‌త్య‌..!
X

దిశ‌, బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండ‌లంలోని వ‌డ్లూరులో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క‌న్న‌ త‌ల్లిని, కుమారుడిని చంపి.. ఆ త‌రువాత తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న పై స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జక్కిని సత్యనారాయణ వ‌డ్లూరు లో హోట‌ల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం ఆయ‌న‌ భార్య పన్ను నొప్పి ఉందని కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లింది. తిరిగి వచ్చే సరికి ఇంట్లో కుమారుడు సరేష్ (38), జక్కని సత్యనారాయణ తల్లి శారద (80) రక్త గాయాలతో చని పోయి ఉన్నారు. మరో గదిలో జక్కని సత్యనారాయణ (65) ఉరి వేసుకొని ఆత్మ హత్య కు పాల్పడాడు. ఈ సంఘటన చూసి సత్యనారాయణ ను భార్య బోరున విలపించింది.దీంతో చుట్టు ప్రక్కల వారు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ సాధన రెష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీను సందర్శించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story